మహిళల భద్రత కోసమే సీడీఈడబ్ల్యు కేంద్రాలు: అదనపు డీజీ షిఖా గోయల్​

by samatah |
మహిళల భద్రత కోసమే సీడీఈడబ్ల్యు కేంద్రాలు:  అదనపు డీజీ షిఖా గోయల్​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో గృహ హింస మొదటిదని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షిఖా గోయల్​అన్నారు. చాలామంది మహిళలు ఈ హింసను మౌనంగా భరిస్తున్నారు తప్పితే బయటకు చెప్పుకోవటం లేదని చెప్పారు. ఇలాంటి మహిళల సమస్యలను పరిష్కరించేందుకు సేఫ్​సిటీ ప్రాజెక్టులో భాగంగా ట్రై కమిషనరేట్లలో 26 సెంటర్​ఫర్​డెవలప్​మెంట్​అండ్​ఎంపవర్​మెంట్​ఆఫ్​ఉమెన్​(సీడీఈడబ్ల్యు) కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాచకొండ కమిషనరేట్​పరిధిలో మంగళవారం ఎల్బీనగర్​లో ఈ సెంటర్​ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యల వల్ల కూడా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయన్నారు. ఈ పరిస్థితిని నివారించటానికే ఈ కౌన్సెలింగ్​సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ సెంటర్లలో నిపుణులైన కౌన్సెలర్లు ఉంటారన్నారు. వీలైనంత మేరకు కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా వీళ్లు కౌన్సెలింగ్​చేస్తారన్నారు. అప్పటికీ రాజీ కుదరక పోతే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వివరించారు. రాచకొండ కమిషనర్​డీ.ఎస్.చౌహాన్​మాట్లాడుతూ మహిళా సాధికారిత, రక్షణ, గృహ హింస, బాహ్య హింస, వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ సెంటర్లు దోహద పడతాయని చెప్పారు. మంగళవారం కమిషనరేట్​పరిధిలో అయిదు సెంటర్లను ప్రారంభించినట్టు తెలిపారు. త్వరలోనే మరో రెండు కేంద్రాలను ప్రారంభించనున్నట్టు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో, ఆన్​లైన్​ఈవ్​టీజింగ్, వేధింపులను అరికట్టటం, సైబర్​స్టాకింగ్​పై అవగాహన కల్పించే నిమిత్తం షార్ట్​ఫిల్మ్​లను రూపొందిస్తున్నట్టు తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించి అవగాహన కల్పించేందుకు ఆడియో, వీడియో వ్యాన్​ను కూడా ఉపయోగించనున్నట్టు వివరించారు. ఉప్పల్​లో జాయింట్​కమిషనర్​సత్యనారాయణ, కుషాయిగూడలో డీసీపీ (అడ్మిన్) పీ.ఇందిర, మీర్​పేట్​లో ఎల్బీనగర్​డీసీపీ సాయిశ్రీ, పహాడీషరీఫ్​లో సైబర్​క్రైమ్స్​డీసీపీ బీ.అనురాధ, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్​లు ఈ కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు. కార్యక్రమంలో రోడ్డు భద్రత, మహిళా భద్రత ఇంఛార్జ్​శ్రీబాల, ఎల్బీనగర్​ఏసీపీ శ్రీధర్​రెడ్డి, షీ టీమ్స్​ఏసీపీ వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story