CBI: తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ దాడులు.. 11 మంది సైబర్‌ క్రిమినల్స్‌ అరెస్ట్!

by Ramesh Goud |
CBI: తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ దాడులు.. 11 మంది సైబర్‌ క్రిమినల్స్‌ అరెస్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 11 మంది సైబర్ క్రిమినల్స్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేరాలకు అమాయక ప్రజలే కాక సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సైతం బలి అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు దాడులు మొదలుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల సైబర్ క్రిమినల్స్ కోసం విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో ఇప్పటివరకు హైదరాబాద్, విశాఖ పట్టణాల్లో మొత్తం 11 మంది సైబర్ క్రిమినల్స్ ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. వీరంతా కాల్ సెంటర్ల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వీరి నుంచి కంప్యూటర్లు, సెల్ ఫోన్లు సహా ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed