- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల సంఘానికి డీఎస్సీ అభ్యర్థుల మెయిల్స్
దిశ, డైనమిక్ బ్యూరో: డీఎస్సీ పరీక్ష నిర్వహణ ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే విషయంలో అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కారణంగా గ్రూప్-2 పరీక్షలను టీఎస్ పీఎస్సీ వాయిదా వేస్తూ వెంటనే నిర్ణయం తీసుకోగా డీఎస్సీ విషయంలో విద్యాశాఖ ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. డీఎస్సీ ఎగ్జామ్స్ నవంబర్ 20 తేదీ నుంచి 30 వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే 30వ తేదీనే తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. దీంతో గ్రూప్ 2 మాదిరిగానే డీస్సీని వాయిదా వేయాలని రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు విద్యాశాఖ కమిషనర్ కు ఇప్పటికే వినతిపత్రం అందజేశారు.
అయినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా హైదరాబాద్ లో ఉంటూ డీఎస్సీకి సన్నద్ధం అవుతున్నామని పరీక్ష నిర్వహిస్తారా లేక వాయిదా వేస్తారో చెబితే తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ విషయంలో అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ మెయిల్ పంపుతున్నారు. తామంతా పోలింగ్ లో పాల్గొనేందుకు వీలుగా పరీక్ష వాయిదా వేసేలా చూడాలని కోరుతున్నారు.