- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయండి.. అభ్యర్థుల డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ తీసుకుంటున్న నిర్ణయాలు నిరుద్యోగులకు ఇబ్బందులు తెచిపెడ్తున్నాయి. ఒకప్రక్క లీకేజీల పర్వం కొనసాగుతుండగా మరోప్రక్క పరీక్షల నిర్వహణకు సంబందించి ఏ ఏ తేదీల్లో నిర్వహించాలనే సరైన విధానం ,మూడు చూపు లేకపోవడంతో అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూపు 2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నారు. వరుసగా పోటీ పరీక్షలు నిర్వహించడం వల్ల సమయం సరిపోక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రూప్ 2 పరీక్షకు ఎకానమి పేపర్ లో అదనంగా 70శాతం సిలబస్ పెంచడం వల్ల తాము పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేకపోతున్నామని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రిపేర్ అయ్యేందుకు పూర్తి సమయం సరిపోకపోవడం వలన మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని అభ్యర్థులు తెలిపారు. వరుసగా పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 2 నుంచి 21 వరకు గురుకుల పరీక్షలు, దీనికి కొనసాగింపుగా సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు జూనియర్ లెక్చరర్ పరీక్షలు పరీక్షలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ అధికారులు ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో చాలా పరీక్షలు వుండడంతో అభ్యర్థులు ఏ పరీక్షకు పూర్తిస్థాయిలో అట్టెంప్ట్ చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. గురుకుల, జూనియర్ లెక్చరర్ పరీక్షలతో ఇబ్బంది ఉందని, గ్రూపు 2 పరీక్షలప్పుడే రాఖీ పండగ వచ్చిందని చెప్పారు. ఆగస్టు 31న రాఖీ సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని దీనితో తమకు పరీక్షలకు వెళ్లాలంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా మారుతుందని అభ్యర్థులు చెబుతున్నారు . మరోవైపు గ్రూపు 2 పరీక్షలు వాయిదా ఉండదని టీఎస్పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10న అభ్యర్థులు ఛలో టీఎస్పీఎస్సీకి పిలుపునిచ్చారు.