- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాన్సర్ ట్రీట్మెంట్‌ను వెంటనే ఆరోగ్య శ్రీలో చేర్చాలి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో క్యాన్సర్చికిత్స కొరకు ప్రత్యేక స్కీమ్, నిధిలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. క్యాన్సర్ పేషెంట్లతో పాటు వ్యాధి తీవ్రమై చనిపోయిన కుంటుంబాలను ఆర్ధికంగా ప్రభుత్వమే అదుకోవాలన్నారు. క్యాన్సర్‌తో రాష్ట్రంలో చాలా మంది పేదలు సరైన వైద్యం అందక చనిపోతున్నారన్నారు. ట్రీట్మెంట్ కోసం ఆస్తులు అమ్ముకొని, అప్పులు చేసి చికిత్స చేపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. దీంతో క్యాన్సర్ పేషెంట్ ల కుటుంబాలు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కొన్ని కుటుంబాలు ఆర్ధిక భారం తట్టుకోలేక చనిపోతున్నారని, పిల్లలు రోడ్డుపై పడాల్సిన దుస్థితి తలెత్తుతుందని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ తో చనిపోయిన కుటుంబాలను ఆర్ధికంగా కూడ అదుకోవాలని కోరారు. క్యాన్సర్ ట్రీట్మెంట్వెంటనే ఆరోగ్య శ్రీ లో చేర్చాలన్నారు. ఇటీవలే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడ ఈ అంశాన్ని ప్రస్తావించానని, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.వైద్య శాఖ మంత్రి హరీష్ రావుదృష్టికి తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. వెంటనే సర్కార్ సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.