కాళేశ్వరంపై కాగ్ సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |
కాళేశ్వరంపై కాగ్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాగ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్‌పై లోతుగా అధ్యయనం చేయడానికి కాగ్ ఉన్నతాధికారి నేరుగా పనులను పరిశీలించనున్నారు. కాగా ఏడాదిన్నర కాలంగా కాగ్ పలు రకాల సమాచారం అడగటం, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించడం, నీటి పారుదల శాఖ అధికారులు వివరణ ఇవ్వడం, వాటిపై కొర్రీలు వేయడం జరుగుతోంది.

తాజాగా హైదరాబాద్ లోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ గా పనిచేస్తున్న నిఖిల్ చక్రవర్తి 11న అన్నారం పంపు హౌస్, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత చీఫ్ ఇంజినీర్ కు, సూపరింటెండింగ్ ఇంజినీర్‌కు లేఖ రాశారు. మూడో సారి పరిశీలనకు ఉన్నతస్థాయి అధికారి నేరుగా వస్తుండటంతో నీటి పారుదల శాఖ వర్గాల్లో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story