అసెంబ్లీలో కాగ్ నివేదిక.. వాస్తవానికి పొంతన లేని బడ్జెట్ అంటూ..

by Sathputhe Rajesh |
అసెంబ్లీలో కాగ్ నివేదిక.. వాస్తవానికి పొంతన లేని బడ్జెట్ అంటూ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2020-21 ఏడాదికి సంబంధించిన ఆర్థిక స్థితిగతులపై కాగ్ రూపొందించిన నివేదికను ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో బడ్జెట్ ను సరిగా అమలు చేయడం లేదని కాగ్ అసహనం వ్యక్తం చేసింది. బడ్జెట్‌లో ఆమోదించిన దానికంటే అధికంగా ఖర్చు చేస్తోందని కాగ్ నివేదికలో పేర్కొంది. 2019-20 లో తీసుకున్న రుణాల్లో 75 శాతానికిపైగా ముందటి అప్పుల చెల్లింపుల కోసం వినియోగించారని తెలిపింది. అప్పుల చెల్లింపులతో ఆస్తుల కల్పనపై ప్రభావం పడిందని విద్య, వైద్య రంగాలపై ఖర్చు చేయలేకపోయారని పేర్కొంది. అంతేకాకుండా, ఈ బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదని, పర్యవేక్షణలో నియంత్రణ లేదని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed