- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకపై చట్టబద్ధంగానే కూల్చివేతలు.. హైడ్రాపై కేబినెట్ సంచలన నిర్ణయం
X
దిశ, వెబ్‌డెస్క్: హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఔటర్ రింగ్ రోడ్డుపై చెరువులు ఎఫ్‌టీఎల్ పరిథిలోని భూములను పరిరక్షించేందుకు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు కేబినెట్ మంత్రులు తెలిపారు. కాగా.. ఈ రోజు (శుక్రవారం) సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ కొద్ది సేపటి క్రితమే ముగిసింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు మంత్రివర్గం నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. పొంగులేటి మాట్లాడుతూ.. హైడ్రాకు చట్టబద్ధత కల్పించే విషయంపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ విభాగం కోసం 169 మంది సిబ్బందిని కూడా కేటాయించబోతున్నట్లు ప్రకటించారు.
Advertisement
Next Story