- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జానయ్యను ఖతం చేయాలని చూస్తున్నారు.. RS ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఓటమి భయంతో మంత్రి జగదీష్ రెడ్డి ఎందుకు తన పోలీసులతోని బీసీ బిడ్డ అయిన వట్టే జానయ్య యాదవ్ మీద ముప్పేట దాడి చేయిస్తున్నాడని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇవాళ ట్విట్టర్ వేదికగా తెలిపారు. జానయ్య మీద ఎన్నడూ లేని కేసులను కుప్పలు తెప్పలుగా, ఆగమేఘాల మీద అక్రమ కేసులు పెట్టించి పీడీ యాక్టు కింద జైలుకు పంపాలని చూస్తున్నాడు? ఎందుకు జానయ్యను కిరాయి మూకలతో ఖతం చేయాలని చూస్తున్నాడని ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి మాఫియా చీకటి దందాల సంగతి గురించి బాగా తెలిసినోడనా అని ప్రశ్నించారు. ‘జానయ్య యాదవ్ ఇప్పటికీ చిన్న ఇంట్లోనే ఉంటూ తన కష్టార్జితాన్ని నీళ్ల లాగా ఖర్చు పెట్టి పనిచేయకపోతే జగదీష్ రెడ్డి 2018లో గెలిచేటోడా? అంటే మేం మిమ్మల్ని గెలిపియ్యాలే, తర్వాత రోజూ భయం భయంగా బతకాలే’ అంటూ పేర్కొన్నారు.
ఆయన ఇంటికి బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్పీ వచ్చినందుకా? ఎప్పుడు సూర్యాపేటలో, తెలంగాణలో రెడ్డి లేదా వెలమ భూస్వాములే రాజకీయాలను శాసించాల్నా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు జీవితాంతం (ఎమ్మెల్యేలయినా) మీకు చంచాలుగానే బతకాల్నా అని ప్రశ్నించారు. నూటికి 99% ఉన్న బహుజనులు కేవలం సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకే పరిమితమై మీ ఇండ్ల దగ్గర కావలి కుక్కలుగానే ఉండాల్నా? వాళ్లకు ఎమ్మెల్యేలు, మంత్రులయ్యే అర్హత లేదా? అని ప్రశ్నించారు.
మనకు ఏమైనా చీము నెత్తురు ఉన్నా తెలంగాణ బహుజన సమాజం అందరం వట్టె జానయ్య యాదవ్‌కు వెన్ను దన్నుగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో గ్రామగ్రామాన రచ్చ బండల దగ్గర అన్ని సంఘాలు కేసీఆర్-జగదీష్ రెడ్డిల మాఫియాలను గద్దె దించాలని ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. కొమరెల్లి మల్లన్న సాక్షిగా చెబుతున్న, ఈ దోపిడీ దొరలకు మన గొల్ల-కురుమ డోలు దెబ్బ, మోకు దెబ్బ, గూటం దెబ్బ, చాకి రేవు దెబ్బ, వల దెబ్బ, నగారా దెబ్బల రుచి చూపించాలే అని పిలుపునిచ్చారు. లక్షలాదిగా స్వచ్ఛందంగా సూర్యాపేటకు రావాలని, ఈ దోపిడీ దొంగ దొరల సంగతేందో చూద్దాము పోలీసోల్లు సంపుతే సద్దాం.. కానీ మన బిడ్డను, మన ఇజ్జత్‌ను కాపాడుకుందాం.. దొరలందరూ ఒకటైనప్పుడు, మనమందరం ఒక్కటి కావాలే. కలవాలే. నిలవాలే. గెలవాలే. రండి.’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.