- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురుకులాలకు పక్కా భవనాలు ఏవీ?: బీఎస్పీ స్టేట్ చీఫ్ R S Praveen Kumar..
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు. రూ 50 కోట్లతో ప్రగతి భవన్, రూ 1,200 కోట్లతో కొత్త సెక్రటరీయేట్ కట్టడానికి నిధులున్నప్పుడు, కొత్త గురుకులాలకు పక్కా భవనాల నిర్మాణం కోసం నిధులు ఎందుకు ఉండవని ప్రశ్నించారు. పేద విద్యార్థులపై కేసీఆర్ కు ఎందుకింత చిన్నచూపు? అని, గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తోందని అయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త గురుకులాల స్థాపించి ఏండ్లు గడుస్తున్నా విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. అన్ని సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో బీసీ-450, ఎస్సీ -130, ఎస్టీ -60 గురుకులాలు అద్దె భవనాల్లో, అరకొర సౌకర్యాలతో కొనసాగుతున్నాయని తెలిపారు. గురుకులాలకు స్వంత భవనాలు లేక విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో ఆగ 'మేఘా'ల మీద పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ( పీఎఫ్సీ ) నుండి లక్ష కోట్లు అప్పు తెచ్చి కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ వేలాది మంది పేద విద్యార్థులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించడానికి మాత్రం బడ్జెట్ లో నిధులు కేటాయించడంలేదన్నారు. సంక్షేమ గురుకులాల్లో అత్యుత్తమ విద్యా బోధన అందిస్తున్నామని, మైకు దొరికినప్పుడల్లా వేదికలెక్కి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థుల గోడు ఏమాత్రం పట్టదని విమర్శించారు. రాబోయే బహుజన రాజ్యంలో ప్రతి మండలానికొక అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలలను ఏర్పాటుచేసి, కుల, మత కేజీ నుండి పీజీ లాగా మాత్రం ఉండదని పేర్కొన్నారు.