కేసీఆర్ ఎక్కడ?.. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్

by Javid Pasha |   ( Updated:2023-03-15 03:15:21.0  )
కేసీఆర్ ఎక్కడ?.. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. ‘టీఎస్పీఎస్సీ లీకుల వ్యవహారం ఎన్నో మలుపులు తీరుగుతున్నది. గ్రూప్–1 ప్రిలిమ్స్ కూడా లీకై ఉండొచ్చన్న వదంతులు వస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా మౌనంగా ఉంది..! లక్షలాది మంది నిరుద్యోగుల కోసం పోరాడుతున్న బీఎస్పీ కార్యకర్తలను మాత్రం పోలీసులు అరెస్టు చేస్తున్నారు. కేసీఆర్ ఎక్కడ’అని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Next Story