దీక్ష విరమించిన బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్

by Javid Pasha |
దీక్ష విరమించిన బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్
X

దిశ, వెబ్ డెస్క్: పేపర్ల లీక్ ల నేపథ్యంలో టీఎస్పీఎస్పీ ఇటీవల నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేయాలంటూ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ ఉదయం తన స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1, ఏఈఈ, టౌన్ ప్లానింగ్, ఏఈ, డీఏఏ పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్పీఎస్పీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన దీక్షను విరమించారు. బీఎస్పీ పార్టీ నాయకులు ఆయనకు నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. అసలు నిందితులను అరెస్ట్ చేసేంత వరకు, అలాగే టీఎస్పీఎస్ చైర్మన్ జనార్థన్ రెడ్డిని తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.

Advertisement

Next Story