- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Assembly: మా కర్మ కాలి అసెంబ్లీకి వచ్చాం.. కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాటలు తమను బాధించాయని.. కర్మ కాలి తాము అసెంబ్లీకి వచ్చినట్లు అయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టారు. బుధవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. తామేం తప్పు చేయలేదని.. పార్టీ మారారు అనే హక్కు మీకు లేదని సీరియస్ అయ్యారు. అసలు తాను పార్టీ మారలేదని.. మీరే మెడ పట్టి బయటకు గెంటేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి ఒక చరిత్ర ఉందని చెప్పారు. 2014లో టికెట్ ఇవ్వకపోయినా తాను పార్టీ కోసం పనిచేశానని గుర్తు చేశారు.
తనను రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చారని తెలిపారు. మహిళలను రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారని చెప్పారు. ప్రస్తుతం మహిళలను కనీసం మాట్లాడనివ్వడం లేదు. ముఖ్యమంత్రి సీటు రేవంత్ రెడ్డి సొంతం కాదు.. నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిన పదవి అని అన్నారు. అనంతరం సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తాము ఏ పార్టీలో ఉన్నా.. కమిట్మెంట్‌తో పనిచేశామని చెప్పారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. జెండా మోసిన కార్యకర్తలను కాపాడుకున్నామని అన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తీరు దొంగలే దొంగ అన్నట్లుగా ఉందని చెప్పారు. డీకే అరుణ, సబితారెడ్డితో పాటు రేవంత్ రెడ్డి తనను కూడా అవమానించారని సునీతా లక్ష్మారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.