లోక్ సభ ఎన్నికల్లో BRS ఒక్క ఎంపీ సీటు గెలవదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 19 |
లోక్ సభ ఎన్నికల్లో BRS ఒక్క ఎంపీ సీటు గెలవదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా సరిగ్గా రావని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివార ఆయన ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ డిబేట్‌లో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీకి సొంతంగా 370 సీట్లు వస్తాయని.. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక, తెలంగాణలో షిండే మోడల్ అంశం మాకు సంబంధం లేనిదని.. అలా బీజేపీ వాళ్లు ఎవరైనా అంటే కూడా తప్పేనని పేర్కొ్న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన అసలు బీజేపీకి లేదని.. వాళ్ల అంతర్గత కుమ్ములాటలతో రేవంత్ రెడ్డి సర్కార్ కూలితే మాత్రం మాకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. రాజ్యాంగం, రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలవి తప్పుడు ఆరోపణలని మండిపడ్డారు.

కాంగ్రెస్ చేస్తోన్న నిరాధార ఆరోపణలకు ప్రధాని మోడీ కూడా సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచన బీజేపీకి లేదని.. రాజ్యాంగం గౌరవాన్ని మరింత పెంచేలా చూస్తామని చెప్పారు. రిజర్వేషన్లపై అమిత్ షా ఫేక్ వీడియోను కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఎవరూ చెప్పలేదని.. కానీ తప్పు ఎవరూ చేసిన తప్పేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో దర్యా్ప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటున్నాయని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed