ఈ ఏడాది బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవు: వేద పండితుడు శ్రీనివాస శర్మ

by Satheesh |
ఈ ఏడాది బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవు: వేద పండితుడు శ్రీనివాస శర్మ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సర్కార్‌లో సమన్వయ లోపం ఉందని, ఈ లోపం కారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని వేద పండితుడు మంగళంపల్లి శ్రీనివాసశర్మ తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఉగాదిని పురస్కరించుకుని మంగళంపల్లి శ్రీనివాస శర్మ పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన కామెంట్లు చేవారు. శోభకృత్ నామ సంవత్సరంలో ధరల హెచ్చుతగ్గులు మినహా మిగిలినవన్నీ శుభ ఫలితాలను ఇస్తుందన్నారు.

మాగాణి, మెట్ట పంటలు బాగా పండుతాయని, గాలి దుమారం వంటి ప్రమాదం ఉందన్నారు. ఈ ఏడాదిలో వెండి, బంగారం ధరలు పెరుగుతాయని వెల్లడించారు. అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని వెల్లడించారు. ఉల్లి, నూనె గింజల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. ఇదిలా ఉండగా అన్ని పార్టీలు వారికి అనుకూలంగా పంచాంగ శ్రవణం చెప్పించుకోగా బీజేపీలో మాత్రం అలాంటిదేమీ జరగలేదు. పూర్తి సాధారణంగా మంగళంపల్లి శ్రీనివాసశర్మ పంచాంగ పఠనం చేశారు.

Advertisement

Next Story