కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి బీఆర్ఎస్ సపోర్ట్.. కడియం రియాక్షన్ ఇదే

by GSrikanth |
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి బీఆర్ఎస్ సపోర్ట్.. కడియం రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. శుక్రవారం శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణన తీర్మానం ప్రవేశపెట్టారు. బీజేపీ, సీపీఐ, ఎమ్ఐఎమ్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా మద్దతు ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ప్రభుత్వం కులగణన, జనగణన, సర్వే చేస్తామంటోందని తెలిపారు. అయితే, సర్వేకు ఇన్ని పదాలు వాడితే గందరగోళం ఏర్పడుతుందని అన్నారు. ఒక స్పష్టమైన పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.

అంతకుమందు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం యల్కుర్తి గ్రామంలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అనుమతి ఇవ్వడం జరిగిందని, 2016లో అప్పటి కేంద్ర మంత్రి వద్దకు వెళ్లి అడిగి ఆ స్కూల్‌ను తీసుకొచ్చామని అన్నారు. 2017లో అగ్రిమెంట్ కూడా జరిగిందని, 49 ఎకరాల 32 కుంటలకు ల్యాండ్ ప్రపోజల్స్ పంపించామని అన్నారు. కానీ, ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో మంజూరు అయిన సైనిక్ స్కూల్‌ను తరలించి సికింద్రాబాద్ కంట్రోన్ మెంట్‌లో ఏర్పాటు చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసిందని అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి మంజూరు అయిన సైనిక్ స్కూల్‌ను తరలించకుండా అక్కడే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కడియం కోరారు.



Next Story