- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS: స్పీడు పెంచిన గులాబీ బాస్.. ఫాంహౌజ్ నుంచే పాలిటిక్స్
దిశ, తెలంగాణ బ్యూరో : గులాబీ పార్టీ రాజకీయం ఫాం హౌజ్ నుంచే నడుస్తున్నది. ప్రజాసమస్యలపై గళం ఎత్తాలన్నా.. జనం మధ్యలోకి వెళ్లాలన్నా.. ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్న అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కేటీఆర్, హరీశ్ రావు, కవితకు సూచనలు చేయడంతోనే స్పీడ్ పెంచినట్లు తెలిసింది. స్థానిక సంస్థలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కీలకం కానున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తే రాబోయే ఏ ఎన్నికలను అయినా విజయం సాధించవచ్చవని, అందుకే ముగ్గురు నేతలను యాక్టివ్ చేసినట్టు సమాచారం. ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై నిత్యం ఆయన ఇచ్చిన సూచనలతో ముందుకెళ్తున్నారు.
ఫాంహౌస్ కేంద్రంగా..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఎర్రవెల్లి ఫాం హౌస్‌లోనే ఉంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బస్సుయాత్ర చేపట్టినా, తిరిగి అక్కడికే వెళ్లారు. పార్టీ నేతలతో సమన్వయ సమావేశాలను అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించిన వ్యూహాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అక్కడే దిశానిర్దేశం చేశారు. మరోవైపు పార్టీ సీనియర్ నేతలతోనూ భేటీ అవుతూ రాష్ట్ర పరిస్థితులు, పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా సమీక్షిస్తున్నారు. సమయానుకూలంగా పార్టీ కార్యక్రమాలపై కార్యచరణ ఇస్తున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. ప్రజల నుంచి ఏ అంశంపై వ్యతిరేకత వస్తుందో అదే అంశంపై ముందుకు వెళ్లాలని కేసీఆర్ ఆదేశాలిస్తున్నారు. సోషల్ మీడియాను పార్టీ ఎక్కువగా వినియోగించుకోవాలని, ప్రభుత్వం అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని గట్టిగా చెప్పినట్టు తెలిసింది. ప్రజల్లో నిత్యం ఉంటేనే పార్టీ మనుగడ సాధ్యమని సీనియర్లకు నిర్దేశం చేస్తున్నారు.
కేసులపై ఆరా
ప్రభుత్వ వైఫల్యాలపై ఎండగడుతున్న సమయంలో నేతలపై నమోదవుతున్న కేసులపైనా కేసీఆర్ ఆరా తీస్తున్నారు. వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపైనా లీగల్ టీంకు, నేతలకు సూచనలు చేస్తున్నారు. ఏ అంశంపై ప్రశ్నిస్తే కేసు పెట్టారని తెలుసుకొని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. లగచర్ల ఘటన, హైడ్రా, నిరుద్యోగుల పక్షాన, రైతు, అంగన్ వాడీల సమస్యలు, సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపైనా కేసీఆర్ సూచనల మేరకే పార్టీ కార్యచరణ తీసుకున్నట్టు సమాచారం. అసెంబ్లీలోనూ ఆయన ఆదేశాల మేరకు రోజుకో అంశంపై సభ్యులు గళమెత్తిన్నట్టు పార్టీ నేతలు తెలిపారు. ప్రజలపక్షాన ఉన్నామని చెప్పడానికే లీగల్ టీంను యాక్టివ్ చేసి భవన్ కు వచ్చే బాధితుల పక్షాన నిలబడుతూ మనోదైర్యం కల్పిస్తున్నట్టు సమాచారం.
ఆ ముగ్గురూ యాక్టివ్..
గతానికి భిన్నంగా కేసీఆర్ పార్టీ కేడర్ ను యాక్టీవ్ చేయాలని, ప్రజల్లో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకొని ముందుకుపోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకే ముగ్గురు ఒకవైపు సోషల్ మీడియా, మరోవైపు జిల్లాల పర్యాటనకు వెళ్తు న్నట్టు తెలిసింది. తొలుత సొంత నియోజకవర్గాలు, జిల్లాలకు వెళ్లాలని ఆ తర్వా త వరుస కార్యక్రమాలు చేపట్టాలని సూచించినట్టు తెలిసింది. కేసీఆర్ ఇచ్చే కార్యచరణతోనే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేయబోతున్నారు.