బీఆర్ఎస్‌‌ను చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధమైన సొంత ఎంపీలు?

by GSrikanth |   ( Updated:2024-02-25 03:26:31.0  )
బీఆర్ఎస్‌‌ను చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధమైన సొంత ఎంపీలు?
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌ను చావు దెబ్బ కొట్టేందుకు సొంత సిట్టింగ్ ఎంపీలు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని, అవగాహన ఒప్పందంతో కలిసే పోటీ చేయబోతున్నాయని ప్రచారం విస్తృతం కావడంతో పలువురు కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీఆర్ఎస్‌ ఇప్పుడు మునిగిపోయిన నావ అని భావించి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం సైతం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే శనివారం అమిత్ షా, జేపీ నడ్డాతో తెలంగాణ కోర్ గ్రూప్ నేతలు చర్చలు జరిపారు.

నాలుగు సిట్టింగ్ స్థానాలతో పాటు మొత్తం 17 స్థానాల ఎంపికపై కసరత్తు చేశారు. ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో జాబితా సిద్ధం చేసి అధిష్టానికి పంపింది. మొత్తం 17 స్థానాలకు 50 పేర్లతో తయారు చేసిన జాబితాను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైకమాండ్ ముందు పెట్టారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న సిట్టింగులపై ఫోకస్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి దింపేందుకు బలమైన అభ్యర్థి కోసం చూస్తున్నారు. ఏళ్లుగా పాతుకుపోయిన ఎమ్ఐఎమ్‌ను ఇంటికి పంపించేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed