- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహారాష్ట్రలో పోటీకి బీఆర్ఎస్ రెడీ?
దిశ,తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ విస్తరణపై సీఎం కేసీఆర్ ఒక్కోరాష్ట్రంలో.. ఒక్కో పాలసీని అమలు చేయనున్నట్టు తెలుస్తున్నది. త్వరలో జరిగే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. జేడీఎస్ కు సపోర్టుగా క్యాంపెయిన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే.. ఆ ఎఫెక్ట్ తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికలపైనా పడుతుందనే అనుమానంలో ఉన్నారు.
పోటీకి రెడీగా ఉండాలంటూ..
మహారాష్ట్రలో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ చేస్తున్నది. ఇందులో భాగంగానే కేసీఆర్ నాందేడ్, కాందార్ లోహలో బహిరంగ సభలు కూడా నిర్వహించారు. స్థానికంగా వివిధ పార్టీల్లో బలంగా ఉన్న లీడర్లనులో బీఆర్ ఎస్ లో చేర్చుకుంటున్నారు. అంతేకాదు వారిని పోటీకి రెడీ ఉండాలని సూచిస్తున్నారు. కావాల్సిన సాయం కూడా అందిస్తామని హామీలు ఇస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఓటర్లు తక్కువ సంఖ్యలో ఉంటారు. దీంతో రెండు, మూడు స్థానాల్లో గెలుస్తామనే ధీమా గులాబీ లీడర్లలో ఉంది.
ప్రచారానికి పరిమితం
కర్ణాకటలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. అక్కడ పోటీకి దూరంగా ఉంటూ జేడీఎస్ కు సపోర్ట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కొంతకాలం కిందట జేడీఎస్ సాకారంతో కొన్నిచోట్ల పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. ఒకవేళ ఓడిపోతే.. త్వరలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని గ్రహించారు. అందుకే జేడీఎస్ కు మద్దతుగా ప్రచారమే మేలనే దిశగా ఆలోచిస్తున్నది.
- Tags
- Maharashtra
- BRS