- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్.. మంత్రి కేటీఆర్ (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఐఎస్బీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సాగు, తాగు నీరు అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తొలి దశలో ప్రాజెక్ట్ పూర్తిపై కొంత భయం ఉండేదని, కానీ కేసీఆర్ లాంటి దార్శనికుడికి అది పెద్ద సమస్య కాలేదని అన్నారు. మిషన్ భగీరథలో భాగంగా తాగు నీటికి సంబంధించి స్టడీ చేయడానికి గుజరాత్ వెళ్లామని, అక్కడి ఇంజనీర్లతో మాట్లాడామని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మూడేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్నట్లు వాళ్లతో చెబితే అంతా నవ్వారని తెలిపారు. సాక్షాత్తు ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలోనే వాటర్ గ్రిడ్ పథకానికి 12 ఏళ్లు పట్టిందని, అలాంటిది మూడేండ్లలో ఎలా పూర్తి చేస్తారంటూ వాళ్లంతా నవ్వారని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ పట్టుదల, కార్యశీలత వల్ల అనుకున్నట్లుగానే ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేశామని చెప్పారు. 12 ఏండ్లు తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పేరుతో ఓ 70 శాతం మందికి మాత్రమే తాగునీరు అందిస్తుంటే తాముమాత్రం ప్రతి ఇంటికి తాగునీరు అందించామని మంత్రి తెలిపారు.