- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KCR : ఎట్టకేలకు ఫాంహౌస్ వీడనున్న కేసీఆర్

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఎట్టకేలకు ఫాంహౌస్ ను వీడనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి కేసీఆర్ తన ఫాంహౌస్ కే పరిమితం అయి.. అక్కడి నుంచే పార్టీ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీఆర్ ఫాంహౌస్ జీవితంపై ఎన్ని విమర్శలు చేసినా.. వాటిని పట్టించుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న అరాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ.. పార్టీ క్యాడర్ అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేస్తూ వచ్చారు. ఇకపై ప్రత్యక్షంగా ముందు నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కేసీఆర్ సిద్ధమయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఈనెల 19వ తేదీన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రకార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని(BRS Party Meeting) నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.
ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కు సమావేశానికి సంబంధించిన కార్యచరణపై ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం 1 గంటనుండి హైద్రాబాద్(HYDERABAD) లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్(Telangana Bhavan) లో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనుండగా.. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్థుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు హాజరు కానున్నట్టు కేటీఆర్ తెలియజేశారు. కాగా ఈ సమావేశంలో.. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించనున్నామని కెటిఆర్ తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలమీద ప్రధానంగా చర్చ జరగున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణ పై సమగ్ర చర్చ జరగనున్నది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ, తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు విధానాల పై ఈ విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారని కేటిఆర్ తెలిపారు. ఆహ్వానితులందరూ తప్పకుండా హాజరుకావాలని ఆహ్వానం అందినట్టు సమాచారం.