- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఇదీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి దుస్థితి’ అంటూ వీడియో రిలీజ్ చేసిన బీఆర్ఎస్
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ ఈ రోజు వరంగల్ లో పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయన రూ.6,100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాగా మోడీ పర్యటన సందర్భంగా ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అవమానించారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ ఓ వీడియో రిలీజ్ చేసింది. వరంగల్ లో పర్యటించిన మోడీ.. సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు నిర్వాహకులు రెడ్ కార్పెట్ ఏర్పాటు చేశారు. అయితే మోడీతో పాటు కిషన్ రెడ్డి కూడా ఆ రెడ్ కార్పెట్ మీద నడిచేందుకు వెళ్లగా.. కిషన్ రెడ్డిని పీఎం సిబ్బంది పక్క నుంచి నడవమన్నట్లు వీడియోలో కనిపించింది.
దీనిపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ.. ఇదీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి దుస్థితి అంటూ ట్విట్టర్ లో విమర్శలు చేసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని రెడ్ కార్పెట్ నుండి పక్కకి నెట్టేసిన ప్రధాని మోడీ సెక్యూరిటీ సిబ్బంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు గుప్పించింది. కాగా అంతకు ఒక్క రోజు ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మోడీ పర్యటనను బహిష్కరిస్తన్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నేతలకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కాగా తాజాగా కిషన్ రెడ్డి ఉదంతాన్ని చూపెడుతూ ఇది అందుకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు బీజేపీపై ఫైర్ అవుతున్నారు.
ఇదీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి దుస్థితి
— BRS Party (@BRSparty) July 8, 2023
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని రెడ్ కార్పెట్ నుండి పక్కకి నెట్టేసిన ప్రధాని మోడీ సెక్యూరిటీ సిబ్బంది. pic.twitter.com/9fRRR6OtoY