- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా జీవితంలో పెట్లబుర్జు ఆస్పత్రికి ప్రత్యేక స్థానం : ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: తాను జన్మించిన పెట్లబుర్జ్ దవాఖాన అభివృద్ధికి గతంలో తాను హామీ ఇచ్చిన కోటి రూపాయల్లో.. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి మొదటి విడతగా 50 లక్షల రూపాయల మంజూరీ పత్రాన్ని ఇవ్వాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా, ఆసుపత్రి సుపరింటెండెంట్ డాక్టర్ పి. మాలతి గారికి అందజేశారు. తాను హామీ ఇచ్చిన మిగతా 50 లక్షల రూపాయలను వచ్చే ఆర్ధిక సంవత్సరం నిధుల నుండి విడుదల చేస్తానని ఆయన తెలిపారు.
పెట్లబుర్జు ఆసుపత్రి అభివృద్ధికి ఎల్లవేలల అండగా ఉంటానని, తనతో పాటు తన మిత్రులు కూడా ఆసుపత్రి అభివృద్ధికి సహకరించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ కుమార్ తాను జన్మించిన దవాఖాన అభివృద్ధి పట్ల చూపించిన ఆసక్తి మిగతా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.