ఎన్నికలకు ముందే చేతులేత్తిసిన BRS ఎంపీ క్యాండిడేట్స్.. అధిష్టానం ఫుల్ సీరియస్..?

by Disha Web Desk 19 |
ఎన్నికలకు ముందే చేతులేత్తిసిన BRS ఎంపీ క్యాండిడేట్స్.. అధిష్టానం ఫుల్ సీరియస్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెజార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులు పార్టీ ఇచ్చిన ఎలక్షన్ ఫండ్‌ను ఖర్చు చేయట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై పార్టీ పెద్దలకు లోకల్ లీడర్లు, కేడర్ ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు నేరుగా అభ్యర్థులకు ఫోన్ చేసి పెద్ద మొత్తంలో ఇచ్చిన పార్టీ ఫండ్‌ను ఎందుకు ఖర్చు చేయట్లేదని ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే గెలిచే అవకాశాలు లేకపోవడంతోనే పార్టీ ఫండ్‌ను బయటికి తీయడం లేదని అభ్యర్థుల సన్నిహితుల్లో చర్చ జరుగుతున్నది.

భారీ స్థాయిలో పార్టీ ఫండ్స్

లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాల్లో ఎలాగైనా గెలిచి తీరాలని బీఆర్ఎస్ టార్గెట్‌గా పెట్టుకున్నది. అందులో భాగంగా ఎంపీ అభ్యర్థులకు ఊహించని స్థాయిలో పార్టీ ఫండ్ పంపించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇచ్చిన నిధులను అభ్యర్థులు ఖర్చు చేయట్లేదని క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నట్టు తెలిసింది. కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి కావాల్సిన ఏర్పాట్లకు సైతం నిధులు ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి.

అయితే మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోలకు ఏర్పాట్లు, జన సమీకరణపై మాత్రమే ఫోకస్ పెట్టి, మిగతా రోజుల్లో కనీసం ప్రచారానికి కూడా ఖర్చు చేయట్లేదని ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంపై కొందరు అభ్యర్థులను లోకల్ లీడర్లు, కేడర్ ప్రశ్నిస్తూ ‘ప్రచారం చేయకుండా ఎందుకు కామ్ ఉంటున్నారు? అని నిలదీసిన సంఘటనలు ఎదురైనట్టు పార్టీలో టాక్ ఉంది.

గెలిచే చాన్స్ లేకనే..?

పార్టీ ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు చేయట్లేదని పార్టీ నేతలు ఆరా తీసినప్పుడు అభ్యర్థులు ఒకే ఒక కారణం ప్రధానంగా చెబుతున్నట్టు తెలిసింది. ‘ఈ ఎన్నికల్లో గెలిచే చాన్స్ లేదు. ఎందుకు వృథాగా ఖర్చు చేయడం’ అని ఎదురు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కొందరు అభ్యర్థులైతే తాము ఇచ్చిన ఫండ్స్ మొత్తం ఖర్చు చేశామని వివరణ ఇస్తున్నట్టు తెలిసింది.

ఒక్కోఅసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక్కో లీడర్‌ను ఎన్నికల ఇన్ చార్జిగా పార్టీ నియమించింది. ఈ ఇన్ చార్జుల్లో కొందరు తమకు ఇచ్చిన ఫండ్స్‌ను మిస్ యూజ్ చేస్తూ, స్థానిక లీడర్ల అవసరాలకు కూడా నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కొందరు అభ్యర్థులు, ఇన్ చార్జిలు పార్టీ ఫండ్స్ ను మొత్తం ఖర్చు చేయకుండా, వెనకేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.

Next Story