- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌లో కడియం శ్రీహరి వ్యాఖ్యల దుమారం!
డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలో రోజు రోజుకూ ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ సెన్సేషనల్‌గా మారాయి. తనకు వేరే వాళ్ల జేబుల్లో చేతులు పెట్టి డబ్బులు తీసుకునే అలవాటు లేదని, నా జేబులో ఉన్న తన డబ్బులు తీసి మీకు ఇచ్చే అలవాటే తప్ప తీసుకునే అలవాటు లేదని అన్నారు. స్టేషన్ గన్ పూర్ లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కడియం శ్రీహరికి మధ్య గత కొంత కాలంగా కోల్డ్ వార్ సాగుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇరువురు నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు మరోసారి రచ్చకెక్కిందనే టాక్ నియోజకవర్గంలో గుప్పుమంటోంది.
ఈ నేపథ్యంలో తాజాగా కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో దుమారం రేపుతున్నాయి. నియోజకవర్గంలోని ఓ కార్యక్రమంలో మాట్లాడిన శ్రీహరి.. 'ఆ నాడు ఎన్టీఆర్, ఈనాడు కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే వినియోగిస్తున్నాని ఎక్కడ కూడా తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నాన్నారు. ఎప్పుడు కూడా కడియం శ్రీహరి నీతి, నిజాయితీగానే ఉంటాడు తప్ప ఎవరి వద్ద లంచం తీసుకునే ప్రయత్నం చేయడు. ఎవరికి తలవంచే ప్రసక్తి లేదు. మీరెవరూ తలదించుకునే పని చేయబోను' అని అన్నారు.
అయితే, కడియం చేసిన ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించేనా అనే చర్చ నియోకవర్గంలో వినిపిస్తోంది. కాగా గతంలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం ఇద్దరూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలు గా పని చేశారు. ఆ తర్వాత రాజయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా కడియంకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే మరోసారి టికెట్ ఇస్తానని ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో ఇరు వర్గాల మధ్య మరోసారి నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహారం జరుగుతోందని, పరస్పరం ఆరోపణలతో ఆధిపత్య పోరు సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో కడియం చేసిన కామెంట్స్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి మరి.