- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG NEWS: మంత్రి శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ.. పార్టీ మారుతారనే ప్రచారం?
దిశ, డైనమిక్ బ్యూరో: ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఇవాళ సచివాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల బృందం మంత్రిని కలిశారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, అరికపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి తదితరులు మంత్రితో చర్చలు జరిపారు. అయితే, ఈ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్‌బాబును కలవడం చర్చనీయంశంగా మారింది. మంత్రి కలవడం వెనుక ఉద్దేశం ఏమిటని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆ సమావేశానికి హజరుకాని ఎమ్మెల్యేల లిస్ట్‌లో వీరు ఉన్నారు.
మంత్రి శ్రీధర్ బాబును కలవడం, మీటింగ్‌కు డుమ్మ కొట్టడంతో వీరు పార్టీ మారుతారా? అనే ప్రచారం జోరుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా వీరు మంత్రిని కలవడం హాట్ టాపిక్ అయింది. అయితే.. తమ నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రితో చర్చలు జరిపినట్లు ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. తమ జిల్లా ఇంచార్జ్ మంత్రి కావడంతో నియోజకవర్గాలకు నిధులు కేటాయించాలని కోరినట్లు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.