- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GunPark : నువ్వు మగాడివి అయితే.. అశోక్‌నగర్ రా.. గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అసెంబ్లీ నుంచి నడుచుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోడ్డుపైకి వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ముందు ఉన్న గన్‌పార్క్ అమరుల స్థూపం వద్దకు చేరి బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అమరుల స్థూపం ముందు కూర్చున్న బీఆర్ఎస్ నేతలు తానాషాహీ నహీ చలేగా.. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటనలు వేయించారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ.. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు.. ఎక్కడా? అని ప్రశ్నించారు. నాలుగు పేపర్లు మీద ఇష్టం వచ్చినట్లు రాసుకోచ్చి జాబ్ క్యాలెండర్ అంటున్నారని, జాబ్ క్యాలెండర్‌తో యువతను మళ్లీ మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలన కోరినట్లు తెలిపారు. కానీ కనీసం 2 నిమిషాలు కూడా మైకు ఇవ్వలేదని అన్నారు. యువతను కాంగ్రెస్ మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.
మరోవైపు అసెంబ్లీలో ఇవాళ అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో దుర్మార్గమైన పదజాలం వాడాడని మండిపడ్డారు. ఇష్టమొచ్చిన మాటలు.. ఇష్టమొచ్చిన బూతులు.. ఆయన మాట్లాడిన మాటలు నోటితో చెప్పలేనని అన్నారు. బజారు భాష మాట్లాడే వద్ద మనం ఎందుకు ఉండాలని సార్.. అని తమ ఎమ్మెల్యే చెప్పడంతో తాము బయటకు వచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని తాము అడుగుతుంటే.. మమ్మల్ని బజారు భాషతో ముఖ్యమంత్రి తిట్టించాడని వెల్లడించారు.
రేవంత్ రెడ్డి నువ్వు మగాడివి అయితే.. అశోక్ నగర్‌రా..
రాహుల్ గాంధీ దమ్ముంటే అశోక్ నగర్ రా.. ఇక్కడికి వచ్చి చెప్పు.. నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు అని కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి నువ్వు కూడా రా.. మేమంతా వస్తామూ అశోక్ నగర్ పోదాం.. ఈ ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని అశోక్‌నగర్ నిరుద్యోగులతో చెప్పించాలని, తాము అందరం రాజీనామా చేసి.. అక్కడే పెట్టి పోతామని చాలెంజ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలను నువ్వు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నావని ఫైర్ అయ్యారు. సిటి సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీకి ఎక్కడికి వస్తారో రండి.. రేవంత్ రెడ్డి నువ్వు మగాడివి అయితే రా.. నీ రాహుల్ గాంధీని తీసుకుని రా.. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో అక్కడ అభ్యర్థులే చెబుతారు.. అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.