CM రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

by GSrikanth |   ( Updated:2024-03-03 06:38:49.0  )
CM రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో కుటుంబసభ్యులతో సహా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెల్లం వెంకట్రావుతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. గతకొంతకాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ సీఎంను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ చేరికలు ప్రారంభించి సక్సెస్ అవుతోంది.


ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌లో సీఎంను కలిసి చర్చలు జరిపారు. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోకవర్గాలుండగా.. భద్రాచలంలో మాత్రమే బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. గతంలో గులాబీ పార్టీలోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కానీ, కాంగ్రెస్‌లో ఆయనకు సీటు దక్కలేదు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరి టికెల్ దక్కించుకొని గెలుపొందారు.

Advertisement

Next Story

Most Viewed