- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS MLA లాస్య నందిత రాజకీయ ప్రస్థానమిదే..!
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) శుక్రవారం జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేసి 17,169 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె ఆకాల మరణం రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
జననం, విద్యాభ్యాసం..
లాస్య నందిత హైదరాబాద్ అశోక్ నగర్ లో జీ.సాయన్న, గీత దంపతులకు 1987లో జన్మించారు. ఆమె కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు.
రాజకీయ ప్రస్థానం..
లాస్య నందిత తన తండ్రి దివంగత ఎమ్మెల్యే జీ. సాయన్న అడుగుజాడల్లో 2015లో పాలిటిక్స్ లోకి వచ్చారు. 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పికెట్ నుంచి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికైంది. 2021లో మాత్రం ఇక్కడి నుంచే కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక, కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న 2023 ఫిబ్రవరి 19 న అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో 2023లో సీఎం కేసీఆర్ ఆమెకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కన్ఫార్మ్ చేశారు. ఈ స్థానం నుంచి ఆమె పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే 17,169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.