- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్, బీజేపీవి అభివృద్ధి నిరోధక విధానాలు
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్, బీజేపీలవి అభివృద్ధి నిరోధక విధానాలని.. ఈ రెండు జాతీయ పార్టీల నిర్వాకం వల్లే దేశం అభివృద్ధిలో వెనుకబడిందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. దేశమంతా తెలంగాణ పథకాలు అమలై దేశాభివృద్ధి సాధించడం ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తెలంగాణ మోడల్ గురించి వివరిస్తున్నప్పుడు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నదన్నారు. మహారాష్ట్ర దేశానికే ఆర్థిక రాజధానిగా ఉన్నప్పటికీ ఎందుకీ వెనుకబాటు తనమని? ఆయన నిలదీశారు.
మహారాష్ట్రలో ఆదాయ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, బడ్జెట్ కూడా బాగానే ఉన్నా అభివృద్ధికి మాత్రం నోచడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ గుజరాత్ మోడల్ ఫేక్ అని, ప్రగతికి ప్రతీక కేసీఆర్ మోడల్ అని ఆయన వ్యాఖ్యానించారు. తొమ్మిదేండ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో విజయాలు సాధిస్తే డబులింజన్ సర్కార్ అని చెప్పే మహారాష్ట్రలో ఎందుకు అభివృద్ధి సాధించలేదని ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తమకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలచారి, మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు మానిక్ కదం, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్, అభయ్ పాటిల్, ఖదీర్ మౌలానాలతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.