- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్‌కు డిపాజిట్ కూడా దక్కదు: మంత్రి సత్యవతి రాథోడ్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. ఎమ్మె్ల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక పార్టీ వైఖరా స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీలోని దొంగలపై ఎన్ని ఈడీ కేసులు పెట్టారని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీని వేట కుక్కల్లా ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి డిపాజిట్లు కూడా రావని ఆమె జోస్యం చెప్పారు. ఒక మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌ను బీజేపీ నుండి సస్పెండ్ చేసి.. బీజేపీ తమ ఔన్నత్యాన్ని చాటుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చీమ చిటుక్కుమంటే స్పందించే గవర్నర్ తమిళి సై.. బండి సంజయ్ కవితపై చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.