- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS, MIM, కాంగ్రెస్ మూడు పార్టీలు ఒక్కటే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఈ సందర్భంగా ఆయన స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని తాను గతంలోనే చెప్పినట్లుగా గుర్తుచేశారు. ఆ మూడు పార్టీల బంధం అవిశ్వాస తీర్మానంతో బయటపడిందని ఆయన పేర్కొన్నారు.
ఈ మూడు పార్టీలు ఒక్కటే అనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. గతంలో ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడిపించాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేసినా అది బీఆర్ఎస్‌కు వేసినట్లే అవుతుందన్నారు. ఢిల్లీలో జరిగే మూడు పార్టీల డ్రామాను ప్రజలంతా గమనిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.