- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Council: గతంతో పోల్చితే ఓసీల జనాభా ఎలా పెరిగింది? మండలిలో మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కవిత ఫైర్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఉభయ సభల్లో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా (Legislative Council) శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha), శాసన మండలి ప్రతిపక్ష నేతగా సిరికొండ మధుసూదనాచారి (Madhusudhanachari) మాట్లాడారు. కులగణన లెక్కలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని, తమకు అవకాశం ఇవ్వాలని మధుసూదనాచారి కోరారు. ఆ డేటా వివరాలు ఎవరి వద్ద కూడా లేవన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీల విషయంలో అనేక హామీలు ఇచ్చిందని, దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అయినా ప్రభుత్వం కొంత కాలయాపన చేసిందని, కోర్టు జోక్యం చేసుకోవడం కులగణన జరిగిందన్నారు.
అయితే కులగణనపై తెలంగాణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారని కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు.. ఇదేమీ సర్వే అధ్యక్ష అని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పండుగ వాతావరణంలో కుటుంబ సర్వే నిర్వహించిదని వివరించారు. విదేశాలలో ఉన్న తెలంగాణ వారు కూడా వచ్చి సర్వేలో పాల్గొన్నారని గుర్తుకు చేశారు. అప్పటి సర్వే నేటి సర్వేకు పోల్చితే బీసీ జనాభా 20 లక్షలు తగ్గిందని రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డేటా బయట పెడుతారని అనుకున్నాము.. నేడు అసెంబ్లీలో ఆ డేటాతోని ప్రభుత్వం ఏం చేయబోతుందో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తారని అనుకున్నామని చెప్పారు. అయితే ఓన్లీ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివిందే.. ఇవాళ స్టేట్ మెంట్ చదివి అయిపోయింది అని మమా అనేస్తే.. ఈ డేటా తోని ఏమి చేయబోతున్నారు.. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి ప్రశ్నించారు. హామీలు ఇచ్చిన విధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా? విద్యా, ఉపాధి, ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా? అని ప్రశ్నించారు. గత జనాభా లెక్కలతో పోల్చితే ప్రస్తుతం తెలంగాణలో 4 కోట్ల 18 లక్షలు ఉండాలని అన్నారు. ప్రభుత్వం చెప్పట్టిన కులగణనలో కేవలం ఓసీల జనాభా పెరిగి.. మిగతా వారిది ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు.