- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana Elections 2023 : మీటింగ్ అంటేనే జంకుతున్న BRS లోకల్ లీడర్లు!
దిశ, నల్లగొండ బ్యూరో: రాష్ట్రంలో 9 సంవత్సరాలుగా అధికారాన్ని చేపట్టి బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఏర్పడింది. దీంతో పార్టీ చాలా ఉత్సాహంగా సభలు, సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజల్లోకి మరింత చొచ్చుకువెళ్లేలా వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రచారానికి పదును పెడుతున్నాయి. కానీ మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా తయారయింది. కరవమంటే కప్పకు కోపం విడువమంటే పాముకు కోపం అన్న చందంగా మునుగోడు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ స్థానిక లీడర్ల పరిస్థితి నెలకొంది. ఇంతకీ నియోజకవర్గంలో ఈ పరిస్థితులకు కారణం మాత్రం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనే టాక్ నడుస్తోంది.
సమావేశాలకు నో చెప్తున్నా లీడర్లు?
ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించి బీఫామ్ కూడా అందజేసింది. దీంతో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలంటూ స్థానిక లీడర్లను ఆదేశించినట్లు తెలుస్తోంది. కానీ స్థానిక లీడర్లు తాము సమావేశాలను ఏర్పాటు చేయలేమని చెప్పలేక అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
దీనంతటికీ కారణం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యే స్థానిక నాయకుల అభిప్రాయం లేకుండానే తన ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు గుసగుసలు వినపడుతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎక్కువ సంఖ్యలో అర్హులు లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని దీంతో తాము సమావేశాలు ఏర్పాటు చేయలేకపోతున్నామని స్థానిక నాయకులు చర్చించుకున్నట్లు సమాచారం. బీసీ బంధు, దళిత బంధు, గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికలు కనీస అర్హత ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని పలువురు బీఆర్ఎస్ నాయకులు తమ సన్నిహితుల వద్ద వాపోయారు.
కేసీఆర్ సభ సక్సెస్ అయ్యేనా?
మునుగోడు నియోజకవర్గంలో ఈనెల 26న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే ఈ సభకు జనాల తరలింపు ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. అనర్హులను సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎంపిక చేయడంతో స్థానిక లీడర్లు ప్రజల్లోకి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు జనాల తరలింపునకు ప్రజలు ఎవరూ కూడా సహకరించే పరిస్థితి లేకపోవడంతో స్థానిక లీడర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మునుగోడు ఎమ్మెల్యే వ్యవహార శైలితో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులు వాపోతున్నారు. దీంతో ఈనెలలో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందా లేదా అనే డైలమాలో పార్టీ శ్రేణులు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలిపై స్థానిక నేతలు ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే ఇంటలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.