- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ కంపెనీ సీఎం రేవంత్ తమ్ముడిది.. బీఆర్ఎస్ నేత సంచలన ఆరోపణ
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ అమెరికా పర్యటన సందర్భంగా స్వచ్ఛ బయోతో వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం అని పత్రికల్లో వార్తలు వచ్చాయి.. ఆ స్వచ్ఛ బయో కంపెనీ రేవంత్ రెడ్డి సొంత కుటుంబానిదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. బుధవారం క్రిశాంత్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ పాలనలో దండుపాల్యం ముఠా చెలరేగుతోందని ఆరోపించారు. స్వచ్ఛ బయోలో మొదటి డైరెక్టర్ వేదవల్లి శివానంద రెడ్డి, రెండో డైరెక్టర్ ఎనుముల జగదీశ్ రెడ్డి(రేవంత్ రెడ్డి సోదరుడు) అని అన్నారు. సీఎంతో ఎంఓయూ కుదుర్చుకున్నపుడు వేదవల్లి గానీ ఎనుముల జగదీశ్ లేరు. ఆ ఎంఓయూ సందర్భంగా సీఎం రేవంత్ ఫొటోలో హర్ష పసునూరి ఉన్నారు. హర్ష పసునూరి సీఎం సోదరుడి బినామీ అని ఆరోపించారు. అసలు స్వచ్ఛ బయో కంపెనీకి వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకునేంత సీన్ లేదు. సీఎం రేవంత్ రాష్ట్ర సంపదను తన సోదరులకు దోచిపెట్టే పనిలో ఉన్నారు. రేవంత్ 30 మంది సభ్యుల ముఠాతో అమెరికా వెళ్ళింది తన సోదరుల వ్యాపారాలు పెంచడం కోసమేనా? అని క్రిశాంక్ ప్రశ్నించారు. స్వచ్ఛ బయో ఒప్పందం మీద కాంగ్రెస్ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు.
‘‘నీ తమ్ముడి కంపెనీతో వ్యాపారం చేయించడానికా రేవంత్ రెడ్డి నీకు సీఎం పదవి వచ్చింది? తమ్ముడి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సీఎం రేవంత్ యూఎస్ దాకా వెళ్ళాలా? కేటీఆర్ యూఎస్ పర్యటన సందర్భంగా ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదిరేవి.. ఇపుడు బోగస్ కంపెనీలు వస్తున్నాయి. మా ఆరోపణలపై సీఎం రేవంత్ మౌనంగా ఉండటానికి వీలు లేదు.. స్పందించాలి. బోగస్ కంపెనీలతో రేవంత్ ఒప్పందాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. రేవంత్ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు బోగస్ కంపెనీలని మేము నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము చెబుతున్నవన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నవే.. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు’’ అని క్రిశాంక్ కీలక ఆరోపణలు చేశారు.