Wife Caught Husband : ఓ రాజకీయ నాయకుడు అనుచరుడి వివాహేతర సంబంధం! రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

by Ramesh N |   ( Updated:2024-08-17 10:25:37.0  )
Wife Caught Husband : ఓ రాజకీయ నాయకుడు అనుచరుడి వివాహేతర సంబంధం! రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి వివాహేతర సంబంధం బయటకు వచ్చింది. మరో మహిళతో ఉండగా అతడి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన గడ్డమీది శ్రీకాంత్‌రెడ్డి ఓ వివాహితతో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని అతడి భార్య ఆరోపిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని అల్వాల్‌లో శ్రీకాంత్‌రెడ్డి ప్రియురాలితో ఉండగా అతడి భార్య, కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ క్రమంలోనే శ్రీకాంత్‌రెడ్డి, అతడి ప్రియురాలిని గంభీరావుపేటకు తీసుకొచ్చిన భార్య కుటుంబ సభ్యులు ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, గంభీరావుపేటకు చెందిన గడ్డమీది శ్రీకాంత్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడని, మాజీ మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు.. అని సమాచారం.

Advertisement

Next Story