రాష్ట్ర చిహ్నం మార్పుపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారా?

by Gantepaka Srikanth |
రాష్ట్ర చిహ్నం మార్పుపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు నిర్ణయాలపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు చేపట్టింది. ఈ క్రమంలో కరీంనగర్‌లో నిర్వహించిన ఆందోళనలో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చిహ్నం మార్పుపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారా? అని ప్రశ్నించారు. రాచరిక వ్యవస్థ పేరుతో లోగోలో చారిత్రక చిహ్నాలను తొలగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ నిర్ణయాలను రేవంత్ రెడ్డి మారుస్తున్నారని మండిపడ్డారు. దీనిపై నిజమైన కాంగ్రెస్ వాదులు ఆలోచించాలని సూచించారు. చట్టప్రకారం రాష్ట్ర చిహ్నాన్ని మార్చే అవకాశం లేదని సీరియస్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రేవంత్ రెడ్డి ఏమీ చేయలేరు అని అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement
Next Story

Most Viewed