- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS: దమ్ముంటే.. హైదరాబాద్ నుండి మొదలు పెట్టు..! సీఎంకు హరీష్ రావు సవాల్
దిశ, డైనమిక్ బ్యూరో: కనీసం మీ పుట్టిన రోజు(Birthday) నాడైన నిర్భంధాలు(Detentions), అక్రమ అరెస్టులు(Illegal arrests) లేకుండా పాలన కొనసాగించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మూసీ(Moosi) పాదయాత్ర సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల(BRS Leaders) అక్రమ అరెస్టులపై స్పందిస్తూ రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు(Happy Birthday Revanth Reddy) తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు.. ముఖ్యమంత్రి మూసి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(Kusukuntla Prabhakar Reddy), చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaiah), భూపాల్ రెడ్డి(Bhupal reddy Kancharla) సహా ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన మీ పాదయాత్రకు ప్రజల మద్దతు లభించదని, ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
మూసీ మురికి కూపంగా మారడానికి మీ 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కదా అని నిలదీశారు. అలాగే రేవంత్ రెడ్డి పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర చేసినా కాంగ్రెస్ పార్టీ పాపం పోదని, పేదల గూడు కూల్చింది ఒక దగ్గర, మీ పాదయాత్ర మరొక దగ్గర అని మండిపడ్డారు. అంతేగాక హైదరాబాద్(HYD)లో ఇండ్లు కూల్చి, నల్లగొండ(Nalgonda)లో పాదయాత్ర చేస్తారా? దమ్ముంటే.. హైదరాబాద్ నుండి మీ పాదయాత్ర మొదలు పెట్టాలని సవాల్(Challenge) విసిరారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజల మద్దతే ఉండి ఉంటే, ఈ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎందుకని, మీ 11 నెలల పాలనే కాదు, మీ పాదయాత్ర కూడా నిర్బంధాల మధ్య కొనసాగుతుండడం దురదృష్టకరమని అన్నారు. అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేసిన మా పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. కనీసం మీరు పుట్టిన ఈ ఒక్క రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఎక్స్ లో రాసుకొచ్చారు.