రుణమాఫీపై నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్

by M.Rajitha |
రుణమాఫీపై నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్
X

దిశ, వెబ్ డెస్క్ : రైతు రుణామాఫీలపై నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. రైతులందరికీ రుణమాఫీలు కాలేదంటూ ముందు నుండి విమర్శిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.40 వేల కోట్ల రుణమాఫీలని, ఇపుడు కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే రుణమాఫీలు చేసారంటూ విమర్శించారు. 40% మంది రైతులకు కూడా రుణమాఫీలు చేయకముందే రుణమాఫీ సక్సెస్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ.. అందుకే ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నామని అన్నారు.

Next Story

Most Viewed