- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: మద్యంపై ఉన్న ధ్యాస.. మద్దతు ధరపై లేకపాయే.. కేటీఆర్ సంచలన ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: మద్యంపై ఉన్న ధ్యాస.. మద్దతు ధరపై లేకపాయే అని, గతంలో ఆరోపణలు చేసి ఇప్పుడు అడ్డగోలుగా ధరలు పెంచుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మద్యం ధరలు పెంపు! అని మీడియాలో వస్తున్న వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్.. మద్యంపై ఉన్న ధ్యాస.. మంచి బోధనపై లేకపాయే, మందు బిళ్లలపై లేకపాయే, మూసి బాధితులపై లేకపాయే, మంచినీళ్లపై లేకపాయే, పింఛన్ పెంపుపై, భరోసా పెంపుపై లేకపాయే అని సంచలన ఆరోపణలు చేశారు. ఇక 10 తగ్గిస్తే పగబట్టి 10 కి 10 కలిపి మరి పెంచుతాం అనబట్టే అని ఎద్దేవా చేశారు. నాడు అడ్డగోలు ఆరోపణలు చేసి, నేడు అడ్డగోలుగా ధరల పెంపు చేపట్టారని అన్నారు. అంతేగాక పెంచుకో.. దంచుకో.. పంచుకో.. అంటూ నేడు మద్యం ధరల పెంపు రేపు రేపు ఏం పెంపో? ఎన్నెన్ని పెంపో? అని కేటీఆర్ విమర్శించారు.