- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాద్‌నగర్ బాధితురాలికి BRS ఆర్థికసాయం
దిశ, వెబ్‌డెస్క్: పోలీసుల దాడిలో గాయపడిన మహిళకు బీఆర్ఎస్ నేతలు ఆర్థిక సాయం చేశారు. సోమవారం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు నేతలు ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు రూ.లక్ష ఆర్థికసాయం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. బాధిత మహిళను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఏడు నెలలుగా రాష్ట్రానికి హోం మంత్రి లేడని మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని అన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. రోజు ఎక్కడో కూడా అఘాయిత్యం జరుగుతున్న వార్తలు చూస్తూనే ఉన్నామని అన్నారు. మహిళపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.