KCR : బీఆర్ఎస్ శ్రేణులపై కేసీఆర్ అసహనం

by M.Rajitha |
KCR : బీఆర్ఎస్ శ్రేణులపై కేసీఆర్ అసహనం
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(BRS Cheif KCR) పార్టీ శ్రేణులపై అసహనం ప్రదర్శించారు. ఏడునెలల సుధీర్ఘ విరామం తర్వాత ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్న విషయం తెలిసిందే. పార్టీ స్థాపించి 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నేడు నేతలతో తెలంగాణ భవన్లో(Telangana Bhavan) చర్చించనున్నారు. కాగా కేసీఆర్ తెలంగాణ భవన్ కి వస్తారని ముందుగానే తెలియడంతో.. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు ఎగబడటంతో తోపులాట జరిగింది. అలాగే సీఎం.. సీఎం అని భారీ ఎత్తున నినాదాలు చేయడంతో కేసీఆర్ ఒకింత అసహనానికి గురయ్యారు.

మీకు దండం పెడతాను, ఒర్లకండిరా బాబు అని కార్యకర్తలకు విన్నవించినా పరిస్థితి సద్దుమణగలేదు. తోపులాట మధ్యలోనే సెక్యూరిటీ సహాయంతో ఆయన పార్టీ ఆఫీసులోకి అడుగు పెట్టారు. అయితే నేడు జరగనున్న కీలక సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, భారీ బహిరంగ సభ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు. అదే విధంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులకు, శ్రేణులకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.

Next Story