- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ కారు స్క్రాప్‌గా మారింది.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ కారు స్క్రాప్‌గా (తుక్కు) మారిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ కారు సర్వీసుకు వెళ్లిందని చెప్పిన మాట వాస్తవం కాదని..అసలు ఆ కారే పనికి రాకుండా పోయిందని చురకలంటిచారు. కాంగ్రెస్‌పై అభాండాలు వేసిన అబద్ధాల కోరు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైనందునే రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు వేరు వేరు నోటిఫికేషన్లు వచ్చాయని కేటీఆర్ విమర్శించడం అసంబద్ధం, అబద్ధమని అన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి అమిత్‌షాతో పాటు ఇతర మంత్రులు హర్‌దీప్ సింగ్, గజేంద్ర షెకావత్, నిర్మలా సీతారామన్‌లను కలిసి రాష్ట్రానికి రావలసిన వనరులు, అధికారుల కేటాయింపుల గురించి మాత్రమేనని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ జనవరి 4న ఎన్నికల ప్రకటనలో భాగంగా మూడు వేర్వేరు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అందులో రెండు తెలంగాణలో, ఒకటి యూపీలో జరుగుతాయని స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు.