- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ టార్గెట్‌గా బీఆర్ఎస్ ప్రచారాస్త్రం రెడీ!
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నది. నిరుద్యోగులు, రైతులు, ఇలా అన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. దీంతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలోననే ఆందోళన అధికార పార్టీలో కనిపించింది. ఇలాంటి సమయంలో ‘మూడు గంటల ఉచిత కరెంటు చాలు’ అన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అంది వచ్చిన అవకాశంగా గులాబీదళం భావిస్తున్నది. ఈ కామెంట్స్ ను తమకు అనుకూలంగా మలుచుకొని మైలేజ్ పెంచుకోవాలని ప్లాన్ వేసింది.
ఇప్పటి వరకు నిరసనలు, మీడియా వేదికగా విమర్శలకే పరిమితమైన లీడర్లను పల్లె బాట పట్టించేందుకు అధిష్టానం ప్రణాళిక రూపొందించింది. ప్రజలు, రైతుల మధ్యలోకి వెళ్లి వారి మన్ననలు పొందాలని ఆదేశించింది. దీని కోసం ఈ నెల 17 నుంచి పది రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలను పిలుపునిచ్చింది. రైతు వేదికల వద్ద ప్రతి రోజు వెయ్యి మందికి తగ్గకుండా సమావేశాలు నిర్వహించి చైతన్యపర్చాలని సూచించింది. కాంగ్రెస్ పార్టీవి రైతు వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించింది. బీఆర్ఎస్ తోనే రైతన్నకు భరోసా అనే అంశాన్ని వివరించాలని నేతలకు సూచించింది.
రైతుల నుంచి ఫీడ్ బ్యాక్...
ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై అన్నదాతల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అంతేకాకుండా ఉచిత కరెంటుపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రైతులకు ఏమేరకు రీచ్ అయ్యాయి? వాటితో హస్తానికి ఏమైనా నష్టం చేకూరుతుందా? బీఆర్ఎస్ ప్రతివిమర్శలతో పార్టీకి మైలేజ్ వచ్చిందా? అని ఆరా తీయనున్నది. పదిరోజులపాటు నిర్వహించబోయే రైతు సమావేశాలు ఏమేరకు కలిసి వస్తాయనేదానిపైనా ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నది. ఇందుకు సంబంధించి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించింది. రుణమాఫీపై రైతుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? రూ. లక్ష మాఫీచేస్తే పార్టీకి ఏమేర కలిసి వస్తుంది? అనే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ అంశం ప్రభావం చూపగలిగితే మళ్లీ మేనిఫెస్టోలో రూ. లక్ష రుణమాఫీని పెట్టేఅవకాశమున్నది.
ప్రజల మధ్య ఉండేలా..
పార్టీ లీడర్లు ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండేలా హై కమాండ్ ప్లాన్ చేస్తున్నది. ఇందుకోసం అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నది. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఇప్పటికే క్షేత్రస్థాయి కార్యకర్తలతో టచ్ లోకి వెళ్లింది. దశాబ్ది ఉత్సవాల పేరుతో 21 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. ఇప్పుడు ఉచిత కరెంటుపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు డిసైడ్ అయింది. దీంట్లోనే రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంటు, రైతుసంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించనున్నది. ఇప్పటికే రూ. 50వేల వరకు రుణమాఫీ చేశామని, మళ్లీ అధికారంలోకి వస్తే రూ. లక్ష రుణమాఫీ చేస్తామని భరోసా కల్పించేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నది. అందుకు రైతు వేదికలను వినియోగించుకునేందుకు సిద్ధమైంది.
ఇవి కూడా చదవండి:: రేపటి రంగంలోకి అన్ని పార్టీల నేతలు.. స్టేట్‌లో పెరగనున్న పొలిటికల్ హీట్!