BRS: వారి గుర్తింపు కోసమే బతుకమ్మ.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
BRS: వారి గుర్తింపు కోసమే బతుకమ్మ.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహ మార్పుపై ఇవాళ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kalvakuntla Kavith) సంచలన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ(Indira Gandhi), సోనియా గాంధీ(Sonia Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పలు సందర్భాలలో బతుకమ్మ పండుగ(Bathukamma Fest) జరిపిన ఫోటోలను పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కవిత ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీలు గుర్తింపు కోసమే బతుకమ్మ పండుగ జరుపుకుంటారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను చెరిపేస్తే మౌనం వహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో శూన్య పాత్ర పోషించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. అంతేగాక రాహుల్ గాంధీ(Rahul Gandhi) మా గుర్తింపుపై ఈ దాడిని మీరు సమర్థిస్తున్నారా? మౌనం ఒక అంఘీకార యోగ్యమా! కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని కవిత ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed