BRS: వాంకిడి ఘటన మరవకముందే మరో దారుణం.. మాజీమంత్రి హరీష్ రావు ట్వీట్

by Ramesh Goud |
BRS: వాంకిడి ఘటన మరవకముందే మరో దారుణం.. మాజీమంత్రి హరీష్ రావు ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వాంకిడి(Vankidi) ఘటన మరవకముందే మరో దారుణం జరిగిందని, ఇకనైనా ప్రభుత్వం(Government) మొద్దు నిద్ర వీడదా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) అన్నారు. పాఠశాలల్లో(Schools) ఫుడ్ పాయిజన్(Food Poisiom) ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఘటనకు సంబంధించిన దృష్యాలను పోస్ట్ చేశారు. దీనిపై వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం(Contaminated Food) తిని 60 మంది విద్యార్థులు(60 Students) ఆసుపత్రి పాలైన ఘటన మరువకముందే నేడు మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన జరగటం దారుణమని మండిపడ్డారు.

12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన బాధ కలిగిస్తున్నదని, పదేపదే ఇలాంటి ఘటన జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం శోచనీయమని అన్నారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో(Gurukula's) ఏం జరుగుతున్నదని, విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి పట్టింపు లేదా?, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదా? అని నిలదీశారు. చదువుకోవడానికి పాఠశాలలకు వెళ్తే ప్రాణాలు కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితి రావడం అత్యంత హేయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కారణాలు చెబుతూ తప్పించుకోవడం వల్ల ప్రయోజనం లేదని, విద్యార్థుల ప్రాణాల పట్ల కార్యాచరణ ప్రకటించాలని, గురుకులాల్లో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని హరీష్ రావు డిమాండ్(Harish Rao Demand) చేశారు.

Advertisement

Next Story

Most Viewed