- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో బ్రిస్టల్ రూ.800 కోట్ల పెట్టుబడి.. 1500 మందికి ఉపాధి!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రూ.800 కోట్ల పెట్టుబడికి బీఎంఎస్ (బ్రిస్టల్ మైర్స్ స్క్వేయిబ్) కంపెనీ ముందుకు వచ్చింది. మూడేళ్లలో 1500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. డ్రగ్ డెవలప్మెంట్, ఐటీ, ఇన్నోవేషన్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని గ్రీన్ పార్క్‌లో గురువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో అమెరికాకు చెందిన బ్రిస్టల్ మైర్స్ స్క్వేయిబ్ కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది.
హైదరాబాద్ ఫార్మాసిటీలో ఉన్న అవకాశాల గురించి కంపెనీ ప్రతినిధులను మంత్రి వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం బయోటెక్నాలజీ, ఐటీకి ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉన్నదని, బీఎంఎస్ కంపెనీ కూడా ఈ రెండు రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఎంఎస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సమ్మిత్ హిరావత్ మాట్లాడుతూ.. కంపెనీ ఐటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, వైద్య అనుబంధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించబోతున్నదన్నారు. కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో శక్తినాగప్పన్ పాల్గొన్నారు.