- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: వైసీపీ ఎమ్మెల్యేలను బీజేపీ గడప కూడా తొక్కనివ్వదు: ఎమ్మెల్యే సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి 165 సీట్లను గెలుచుకుని ఘన విజయం సాధించింది. 2019లో 151 సీట్లను గెలుచుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లలో మాత్రమే గెలుపొంది ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే, వైసీపీ అధికారంలో ఉన్న నాడు ప్రతిపక్ష నాయకులపై జరిగిన దమనకాండపై పలువురు నాయకులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న నాడు చేసిన తప్పులకు ఇప్పుడు వైసీపీ భయపడుతోందని అన్నారు. ముందు కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టిందే జగన్ అని ఆరోపించారు. ప్రజాగ్రహానకి గురైన వైసీపీ ఈవీఎం ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపించడం సిగ్గుచేటుగా ఉందని అన్నారు. ప్రజా తీర్పును వైసీపీ నేతలు తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భవిష్యత్తులో వైసీపీ ఎమ్మెల్యేను బీజేపీ గడప కూడా తొక్కనివ్వదని సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.