BREAKING: రైతు రుణమాఫీ హామీ ఏమైంది రేవంత్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING: రైతు రుణమాఫీ హామీ ఏమైంది రేవంత్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ ఏమైంది రేవంత్‌ అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ ఆయన మెదక్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బూటకపు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఏక కాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి నేడు ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నిన్నటి పార్టీ అని, ఇప్పుడది లేదని.. రేపు ఆ పార్టీ అవసరం రాష్ట్రానిక లేదన్నారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతిపరులను బీజేపీ వదిలిపెట్టబోదని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడిగే ముందు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీయే ప్రధాని కావాలంటూ ప్రజలకు కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. మెదక్ ఎంపీ అభ్యర్థికి రఘునందన్‌రావును అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రధాని మోడీకి కానుకగా ఇవ్వాలన్నారు.

Next Story

Most Viewed