- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ను ఖచ్చితంగా ఓడిస్తాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవ్వడానికి బీజేపీకి సంబంధం లేదని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతిపరులైన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని అన్నారు. కాంగ్రెస్ పదేళ్ల కాలంలో రూ.12లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అయినా.. తప్పు చేసిన వాళ్లను అరెస్ట్ చేస్తే.. అందులో బీజేపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు.
కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామని కవిత చెప్పాలంటూ డిమాండ్ చేశారు. బినామీలతో మద్యం వ్యాపారం చేసిందే గాక.. మాపైనే విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనేది ఓ స్వతంత్ర సంస్థ అని, ఆ సంస్థకు అన్ని అధికారాలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కేవలం ఫ్లెక్సీల వరకే అమలు అవుతన్నాయని ఎద్దేవా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా అసదుద్దీన్‌ను ఓడించి తీరుతామని అన్నారు.